చేర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

-గెలుపొందిన కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం -చైర్మన్ పీఠం బిఆర్ఎస్ కైవసం

Siddipet Bureau
1 Min Read

 చేర్యాల మున్సిపల్ చైర్మన్ గా ముస్త్యాల అరుణ బాల నర్సయ్య-వైస్ చైర్మన్ గా మేడిశెట్టి ఉమ

చేర్యాల ఫిబ్రవరి 16(ప్రజాజ్యోతి):చేర్యాల మున్సిపాలిటీలో ఈ నెల 13 న జరిగిన ఎన్నికల ఫలితాల్లో 12 వార్డులకు గాను 7 వార్డులు బిఆర్ఎస్ పార్టీ,5 వార్డులు కాంగ్రెస్ పార్టీ  గెలుచుకున్న విషయం విదితమే కాగా సోమవారం నాడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పాత ప్రభుత్వ ఆసుపత్రి లో చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను ఏర్పాటు చేశారు. ఫలితాల వెల్లడి తర్వాత గెలుపొందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ కౌన్సిలర్లు వేరువేరుగా క్యాంపులకు బయలుదేరి వెళ్లారు. తిరిగి సోమవారం ఉదయం క్యాంపు నుంచి తిరిగి వచ్చి నేరుగా మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక సమావేశంలో పాల్గొన్నారు.గెలుపొందిన12 మంది మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం చేసిన అనంతరం చైర్మన్,వైస్ ఛైర్మన్ లను ఎన్నుకున్నారు.మున్సిపల్ చైర్మన్ పీఠం బిఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది.మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో 6 వ వార్డు నుండి కౌన్సిలర్ గా గెలుపొందిన ముస్త్యాల అరుణ బాలనర్సయ్య ను ఛైర్మన్ గా ,10 వార్డు నుండి గెలుపొందిన మేడిశెట్టి ఉమ శ్రీధర్ ను వైస్ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *