
మామడ మండలంలోని పొన్కల్ శివాలయం నందు
మహా శివరాత్రి సందర్భంగా ఉపవాసాలుండే భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నదానం సోమవారం శివాలయం వద్ద నిర్వహించారు.
ముఖ్యంగా శివాలయం ప్రాంతంలో ఆలయ నిర్వాహకులతో పాటు గ్రామ విడిసి, స్థానిక యువకులు, భక్తులు కలిసి అన్నదానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయాల చైర్మన్, క్యాషియర్ మరియు విడిసి సభ్యులతో పాటు భక్తులు గ్రామ ప్రజలు ఉన్నారు.
స్థానికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు సైతం వచ్చి అన్నదానంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామంలోని ఉన్నత పాఠశాల ఎన్ సి సి విద్యార్థిని, విద్యార్థులు తమ సేవలను అందించారు
మహా శివరాత్రి పర్వ దినాన్ని పురస్కరించుకొని ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం
Leave a Comment
