“సమ్మక్క-సారలమ్మ నా కొడుకు భారీ నుండి కాపాడండి” హుండీలో భక్తురాలి వినూత్న మొక్కు

Warangal Bureau
1 Min Read
  • “సమ్మక్క-సారలమ్మ నా కొడుకు భారీ నుండి కాపాడండి” హుండీలో భక్తురాలి వినూత్న మొక్క

 మూడో రోజు 2కోట్ల ఆదాయం 

828 హుండీల్లో 425 హుండీల నుండి మొత్తం 8కోట్ల 6 లక్షల ఆదాయం 

వరంగల్ బ్యూరో, ఫిబ్రవరి 07 (ప్రజాజ్యోతి)::

మేడారం మహా జాతర హుండీ లెక్కింపు మూడో రోజుకు చేరింది. హనుమకొండ లోని టీటిడి మండపంలో హుండీల లెక్కింపు కొనసాగుతుంది. ఈ లెక్కింపుకు కెనరా, యూనియన్ లతో పాటు పలు బ్యాంకులు సహకరిస్తున్నాయి. హుండీల్లో భక్తులు వేసిన కానుకలతో పాటు చిత్రమైన కోరికలు బయటపడుతున్నాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తుల భక్తిశ్రద్ధకు మరో నిదర్శనం కనిపించింది. హుండీల్లో కానుకలు సమర్పించిన భక్తులు తమ కోరికలను వినూత్నంగా వనదేవతల ముందు వ్యక్తం చేశారు. వంద రూపాయల నోటుపై “సమ్మక్క-సారలమ్మ నా కొడుకు భారీ నుంచి కాపాడండి” అంటూ ఓ భక్తురాలు వంద రూపాయల నోటుపై రాసి హుండీలో వేయడం గమనార్హం. ఇక మరికొందరు భక్తులు పెళ్లి కావాలని, సంతానం ప్రసాదించాలని తెల్ల కాగితాలపై రాసి హుండీల్లో సమర్పించారు. భక్తుల నమ్మకం, ఆరాధన ఎంతగా ఉందో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది. మూడో రోజు మేడారం 140 హుండీల లెక్కింపు. 2కోట్ల 1లక్ష 90వేలు. ఇప్పటివరకు 425 హుండీల లెక్కింపు ద్వారా వచ్చిన ఆదాయం 8కోట్ల 6లక్షలు. మొత్తం 828 హుండీలకు గాను ఇప్పటి వరకు 425 హుండీలు ఓపెన్ చేశారు. వీటి నుండి 8 కోట్ల 6లక్షలు ఆదాయం వచ్చింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *