వినూత్న ర్యాలీతో.. నామినేషన్ దాఖలు

Bharath Gowd
0 Min Read

కౌన్సిలర్ అభ్యర్థి పైడి శ్రీధర్ గుప్తా

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ కోలాహలం నెలకొంది. తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్గా శ్రీధర్ గుప్తా శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఎద్దుల బండిపై ఆయన నామినేషన్ వేయడానికి రావడం అందరినీ ఆకట్టుకుంది. రైతే దేశానికి వెన్నెముక అని, ఆ రైతన్న గుర్తుగా, సామాన్యుడి ప్రతినిధిగా నేను ప్రజల ముందుకు వస్తున్నాను” అనే సందేశాన్ని ఈ వినూత్న ప్రచారం ద్వారా ఆయన చాటిచెప్పారు. ఎద్దుల బండిపై ర్యాలీగా వెళ్తున్న అభ్యర్థిని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *