బాధిత కుటుంబాలకు ‘కుటుంబ భరోసా’ ఆర్థిక చేయూత

Kamareddy
1 Min Read

బాధిత కుటుంబాలకు ‘కుటుంబ భరోసా’

— ఆర్థిక చేయూత

కామారెడ్డి డిసెంబర్ 25 (ప్రజా జ్యోతి)

అనారోగ్యం మరియు ప్రమాదాల బారిన పడి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా ‘కుటుంబ భరోసా’ సంస్థ తన వంతు సాయం అందిస్తోంది. కామారెడ్డి పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు గురువారం రాష్ట్ర యూనియన్ సహకారంతో జిల్లా మరియు మండల కమిటీల ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి టౌన్‌కు చెందిన దీకొండ వెంకటేశం గత కొన్ని నెలల క్రితం పక్షవాతానికి గురై, ప్రస్తుతం ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారు. అలాగే, వేముల రవికుమార్ అనే వ్యక్తికి కాలు విరగడంతో గత రెండు నెలలుగా పనులకు వెళ్లలేని స్థితిలో పరిమితమయ్యారు. వీరిద్దరి దయనీయ స్థితిని గమనించిన కుటుంబ భరోసా సభ్యులు, ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు.

రాష్ట్రవ్యాప్త సేవలలో భాగంగాజిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. కుటుంబ భరోసా పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు వందలాది మంది బాధితులకు చేయూతనిచ్చామని తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నవీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, క్యాషియర్ భూపాల్, పట్టణ అధ్యక్షులు బాలరాజ్, కార్యదర్శి గోపి, క్యాషియర్ ప్రసాద్‌తో పాటు సభ్యులు శ్రావణ్, శమీర్, శ్రీనివాస్, శీను, సంతోష, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *