*నేడు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం చూద్దాము రారండి*
-దక్షిణ కైలాస శిఖరంగా పేరుగాంచిన కైలాస్ టెక్డి వేదిక
-కళ్యాణం కనులవిందుగా వీక్షించే అవకాశం
బోథ్, డిసెంబర్ 8 (ప్రజా జ్యోతి)
బోథ్ మండలంలోని నీకునే గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న మహారాష్ట్ర సరిహద్దు సమీపము లో సింహాద్రి పర్వతశ్రేణిలో కొలువైన
శిఖర్ కైలాస్ టేకిడిలో సంత్ లింభాజీ మహారాజ్ చే అత్యంత భక్తి ప్రవృత్తులచే వేలాది మంది హర్ష ధ్వనుల మధ్య పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ పేర్కొన్నారు. సోమవారం జరిగే ఈ కళ్యాణ మహోత్సవమును కనులారా వీక్షించి దర్శించుకుని మహోన్నతమైన అద్భుతమైన మహా ఘట్టం కు ప్రతి ఒక్క భక్తుడు వీక్షించి ధన్యులు కావాలని భక్తులకు తెలిపారు.
