బుల్లెట్ వాహనాల మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు*

Khamman Bureau
1 Min Read

బుల్లెట్ వాహనాల మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు

మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చిన బుల్లెట్ వాహనాల సైలెన్సర్లను తొలగించి, జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు..
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మోడిఫైడ్ సైలెన్సర్లతో నడిపే బుల్లెట్ వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.కొందరు యువకులు వాహనాలకు సంబంధిత సంస్థ ఇచ్చిన సైలెన్సర్లను మార్పుచేసి.. వింత శబ్దం, అగ్ని మంట వచ్చే వాటిని అమర్చి, రోడ్లపై అకస్మాత్తుగా వింత శబ్దాలు చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతున్న నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈరోజు 20 మోడిఫైడ్ సైలెన్సర్ల వరకూ తొలగించి ఒక్కో వాహనదారుడికి రూ.1,000 జరిమానా విధించారమని తెలిపారు. ఇప్పటికే సుమారు1000 మోడిఫైడ్ సైలెన్సర్ల వరకు తొలగించడం జరిగిందని తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *