ఇస్త్రీ షాపుల నూతన కమిటీ ఎన్నిక

Nalgonda Bureau
1 Min Read

ఇస్త్రీ షాపుల నూతన కమిటీ ఎన్నిక

 

 

చిట్యాల జూన్ 24(ప్రజా జ్యోతి); నల్గొండ జిల్లా, చిట్యాల పట్టణ ఇస్త్రీ,డ్రై క్లీనింగ్ షాపుల యూనియన్ సమావేశం జరిపి నూతన కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఐతరాజు యాదయ్య తెలిపారు.పట్టణ కేంద్రంలో మంగళవారం నాడు జరిగిన సమావేశంలో యూనియన్ నూతన అధ్యక్ష, కార్యదర్శి లుగా అక్కెనపల్లి నాగయ్య, ఐతరాజు యాదయ్య లను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు తెలిపారు.అదే విధంగా సంఘం గౌరవ సలహాదారులుగా ఫైళ్ల ఆశయ్య, గౌరవ అధ్యక్షులు గా చెర్కు పెద్దులు, ఉపాధ్యక్షులుగా ‌ పాలమాకుల అర్జున్, నలపరాజు శేఖర్,సహాయ కార్యదర్శిగా అమరోజు రాములు,బండగోని వెంకన్న, కోశాధికారిగా ఐతరాజు సైదులు,కార్యవర్గ సభ్యులుగా నా మనంది అంజయ్య,దామనూరు వెంకన్న,ఐతరాజు సత్తయ్య,వెలిమినేటి అంజయ్య,గుండెగోని సత్తయ్య లు ఎంపికైనట్లు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *