ఇంట్లో బీరువాలో ఏముందో ఎవరికీ తెలియదు. అలా చెప్పరు కూడా. ఎందుకంటే అప్పుకు అయినా లేదా మరో సాయానికి అయినా ఆ ఫ్యామిలీ ఇమేజ్ చాలా ముఖ్యం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద అనుకుంటే అక్కడ ఉన్న ఖజానా బీరువా అనుకుంటే ఆ గుట్టూ కూడా ఎవరూ చెప్పరు. పాలకులు అయితే డబ్బులు లేవు అని అలా ఏదో యాధాలాపంగా రాజకీయ ఎత్తుగడలలో భాగంగా కూడా చెబుతూంటారు. కానీ నిజంగా ఎంత ఉందో ఏముందో ఎవరికీ చెప్పరు
అయితే తెలంగాణా ఎమ్మెల్యే సీపీఐకి చెందిన కూనంనేని సాంబశివరావు తెలంగాణా ఖజానా గుట్టు ఏమిటో చెప్పేశారు. ఆయన తాజాగా కొత్తగూడెంలో పర్యటిస్తూ ఖజానా ఇబ్బందికరంగా ఉందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సైతం ఇచ్చేందుకు ఇబ్బందు పడాల్సి వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన కొన్ని హామీలను నెరవేర్చడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు అని కీలకమైన వ్యాఖ్యలను కూడా చేశారు. ఇక కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయానికి వస్తే పేదింటి యువతులకు లక్షా పదహారు వేల రూపాయలతో పాటు అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పింది. అంతే కాదు ఇతర హామీలు కూడా ఉన్నాయి. అయితే సీపీఐకి చెందిన సాంబశివరావు ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇబ్బందిగా ఉందని ఆయన అన్నారు. అందువల్ల ఇప్పట్లో లక్ష నూట పదహార్లు ప్రతీ పేద యువతి హామీ కానీ అలాగే తులం బంగారం కానీ నెరవేర్చడం కష్టమన్నట్లుగా మాట్లాడారు.
అయితే ఇది ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణా రాష్ట్రం అయితే సంపన్న రాష్ట్రంగా ఉందన్న భావన ఉంది. దానికి తోడు అనేక హామీలను ఇచ్చి మరీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక మహిళలందరికీ ఉచిత బస్సు పధకాన్ని అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అమలు చేసింది. రైతులకు రుణ మాఫీ చేసింది. అయినా సరే కీలకమైన హామీలు కొన్ని ఉన్నాయి. వాటిని అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ సమయంలో సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశం అవుతున్నాయి. నిజంగా ప్రభుత్వం హామీలు ఇప్పట్లో అమలు చేయలేదా అన్నది అందరిలోనూ పట్టుకుంటోంది. ఒకవేళ అదే కనుక జరిగితే పరిస్థితి ఏమిటి ఆంతా ఆందోళన చెందే అవకాశం ఉంది.
మరో వైపు చూస్తే విపక్షాలకు ఈ రకమైన వ్యాఖ్యలు ఊతమిస్తాయని వారికి ఆయుధంగా మారుతాయని కూడా అంటున్నారు. మంచి ఉద్దేశ్యంలో కామ్రేడ్ ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి గురించి వివరించినా ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణా సర్కార్ కి జీతాలు కూడా ఇవ్వడం కష్టంగా మారుతోందా అన్న చర్చ ఇపుడు అంతటా ఉంది. చూడాలి మరి దీని మీద కాంగ్రెస్ పెద్దలు ఏ రకంగా రియాక్ట్ అవుతారో