BIG BREAKING….
కొత్తగూడెం (సింగరేణి), ప్రజాజ్యోతి : ఏసీబీ అదుపులో సింగరేణి మెయిన్ వర్క్ షాప్ డ్రైవర్ అన్న బోయిన రాజేశ్వరరావు. సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, మెడికల్ అన్ ఫిట్ చేయిస్తానని, బదిలీలు చేయిస్తానని 50 లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడినట్టు సమాచారం. ఆయనతోపాటు మరో బృందంగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూటలో ప్రధానంగా గతంలో సంస్థ ఉద్యోగిగా ఉంటూ అనేక అవకతవకలకు పాల్పడి డిస్మిస్ కు గురైన ఓ ఉద్యోగి ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అవినీతి ఆరోపణలతో ఉద్యోగం పోగొట్టుకున్న ఆయన ప్రస్తుతానికి న్యాయవాదిగా అవతారం ఎత్తి మరిన్ని అక్రమ పనులకు పూనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే సంస్థలోని కొందరి ఉద్యోగులను అనుచరులుగా పెట్టుకొని అక్రమాలకు తెర లేపినట్టు పలువురు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు పక్క ఆధారాలతో రాజేశ్వరరావు ను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మరి కొంతమంది పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.