సాంకేతిక దిగ్గజం సీమెన్స్ స్పెయిన్ సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం ఆకాశంలోనే ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. న్యూయార్క్ నగరంలోని హడ్సన్ నదిపై ఎగురుతున్న వారి హెలికాప్టర్ రెక్కలు ఊడిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణం ఒక చిన్న నట్టు అని నిపుణులు భావిస్తున్నారు. ఆ నట్టు పేరు “జీసస్ నట్
హెలికాప్టర్ రోటర్ బ్లేడ్‌లను మాస్ట్‌కు కలిపి ఉంచే కీలకమైన భాగం ఈ జీసస్ నట్. ఈ నట్ హెలికాప్టర్‌కు అత్యంత ముఖ్యమైనది. వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా సైనికులు దీనికి ఈ పేరు పెట్టారు. అప్పట్లో హెలికాప్టర్లలో దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు.
ప్రమాదం ఎలా జరిగింది? నిపుణుల అభిప్రాయం ప్రకారం, అగస్టిన్ కుటుంబం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గాలిలో ఉండగానే ఈ నట్ ఊడిపోయింది. దీంతో రోటర్ బ్లేడ్‌లు హెలికాప్టర్ నుండి విడిపోయి, వేగంగా తిరుగుతూ నదిలో పడ్డాయి. ఈ భయానక దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. హెలికాప్టర్ ఎగరడానికి ముందు ఈ నట్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. కానీ, ఈ ప్రమాదానికి ముందు అలాంటి తనిఖీ జరగలేదని సమాచారం. హెలికాప్టర్ పరిస్థితి ఏమిటి? ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లో గతంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. గత సంవత్సరం ఈ హెలికాప్టర్‌లో ట్రాన్స్‌మిషన్ సమస్య తలెత్తిందని ఫెడరల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఇది దాదాపు 12,000 గంటలపాటు ఆకాశంలో ప్రయాణించింది. దీనికి చాలా మరమ్మతులు అవసరం. మార్చి 1న దీనికి తనిఖీలు పూర్తయ్యాయి. దురదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన రోజు ఇది వరుసగా ఎనిమిదవసారి ఎగిరింది. ఈ హెలికాప్టర్‌కు సంబంధించిన ఫ్లైట్ రికార్డులు కూడా లేవని న్యూయార్క్ పోస్ట్ కథనంలో అధికారులు ధృవీకరించారు. అంతేకాకుండా, దీనికి అవసరమైన విడి భాగాలు కూడా అందుబాటులో లేవని సమాచారం.