నిత్యానంద స్వామి చనిపోయారంటూ వార్తలు!

V. Sai Krishna Reddy
1 Min Read

వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త స్వామి నిత్యానంద స్వామి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో కొత్త దేశాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ దేశం ఎక్కడ ఉందనేది మాత్రం ఎవరికీ తెలియదు. 2023లో నిత్యానంద స్వామి ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరై ప్రసంగించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా నిత్యానందకు సంబంధించిన ఓ వార్త సంచలనం రేకెత్తిస్తోంది. నిత్యానంద చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ ఈ సందేశాన్ని మీడియాకు పంపినట్టు సమాచారం. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఆయన తన ప్రాణాలను త్యాగం చేశారని సుందరేశ్వరన్ చెప్పినట్టు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితమే నిత్యానంద చనిపోయినట్టు చెబుతున్నారు.

అయితే ఈ వార్తలను పలువురు కొట్టివేస్తున్నారు. ఏప్రిల్ ఫూల్ చేయడానికే ఈ వార్తను ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అయితే నిత్యానంద చనిపోయినట్టు అధికారికంగా ఇప్పటి వరకు ఎవరు ప్రకటన చేయలేదు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *