ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ధర ఎంత? ఇది ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుంది?

V. Sai Krishna Reddy
1 Min Read

ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుందని సమాచారం. ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ ఆపిల్ ఫోన్ ఖరీదైన ధరతో ప్రీమియం కేటగిరీ కింద లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే పరిశ్రమ విశ్లేషకుడు టిమ్ లాంగ్ మాట్లాడుతూ.. ఫోల్డబుల్ ఐఫోన్ ధర USలో $2,300 (సుమారు రూ. 1,91,000) వరకు ఉండవచ్చని పేర్కొన్నారు. కంపెనీ తన ఫోల్డబుల్ ఐఫోన్‌పై పనిచేస్తోంది. ఈ ఆపిల్ ఫోన్‌ త్వరలో మార్కెట్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోల్డబుల్ ఐఫోన్ గురించి చాలా పుకార్లు ఉన్నాయి. ఆపిల్ తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను 2026 లో విడుదల చేసే అవకాశం ఉంది. లేదా కంపెనీ ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను 2027 ప్రారంభంలో లాంచ్ చేయవచ్చు. ఈ ఫోల్డబుల్ ఐఫోన్ ధర $2,000, $2,500 (రూ.1,66,000 నుండి 2,08,000) మధ్య ఉండవచ్చ టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు టిమ్ లాంగ్ కూడా ఈ ఐఫోన్ ఈ ధర పరిధిలోనే లాంచ్ అవుతుందని చెప్పారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *