బిల్ గేట్స్ అంటే దాదాపుగా అందరికీ తెలిసిందే. ఆయన సాఫ్ట్ వేర్ రంగంలో ఎంతటి ఉన్నత శిఖరాలను అందుకున్నారో జగద్విదితమే.
బిల్ గేట్స్ అంటే దాదాపుగా అందరికీ తెలిసిందే. ఆయన సాఫ్ట్ వేర్ రంగంలో ఎంతటి ఉన్నత శిఖరాలను అందుకున్నారో జగద్విదితమే. ఆయన సాధించని విజయాలు లేవు. ఆయన చూడని ఎత్తులు లేవు. ఆయన ఇంత చేసినా చాలా సింపుల్ గా ఉంటారు. ఆయనకు ప్రపంచంలో ఎక్కువగా భారత్ అంటే ఇష్టం. అది ఆయన మాటలలో చేతలలో చర్యలలో కూడా ఎప్పటికప్పుడు బయట పడుతూ వస్తోంది. ఆయన భారత దేశం అంటే ఎందుకు ఇష్టం అంటే అక్కడ గ్రామీణ వాతావరణం గురించి అని అంటారు. అలాగే దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఆయన ఎప్పటికప్పుడు సలహా సూచనలు ఇస్తూ వస్తున్నారు.
ఇక వీలు దొరికితే చాలు ఆయన భారత్ కి వస్తూంటారు. అలా భారత్ మీద ప్రత్యేక ప్రేమను చూపిస్తున్న బిల్ గేట్స్ గురించి ఇపుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. బిల్ గేట్స్ భారతదేశంలో స్థిరపడతారు అన్నదే ఆ చర్చ. అంతే కాదు ఆయన ఏకంగా హైదరాబాద్ లో నివాసం ఉంటారు అన్నది మరో చర్చ. ఈ దేశంలో పాతికేళ్ల క్రితమే బిల్ గేట్స్ హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ పేరుతో సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీకి నాంది పలికారు. అలా ఆనాడే ఆయన హైదరాబాద్ పట్ల మక్కువ కనబరచారు అని గుర్తు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన మమకారం అభిమానం దేశం మీద హైదరాబాద్ ప్రాంతం మీద మరింతగా పెరుగుతూ వస్తోంది అని అంటున్నారు. ఈ క్రమంలో బిల్ గేట్స్ తన మిగిలిన జీవితం అంతా భారత్ లోనే గడపాలని మనసారా కోరుకుంటున్నారు అని అంటున్నారు. దానికి ప్రధాన కారణం ఆయనకు భారతీయ సంస్కృతి బాగా నచ్చింది అని అంటున్నారు. భారత దేశం పట్ల ఆయన మోజు పడడానికి అనేక రీజన్స్ లో ఇది ప్రధానమైనది అని చెప్పుకుంటున్నారు. ఆయన భారత దేశానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో సేవ చేస్తూ ఉంటారు. ఆయన ఆలోచనా విధానానికి భారత దేశం తగినది అని భావిస్తున్నారని అంటున్నారు. ఇక ఆయన సన్నిహితులు ఆయన గురించి అనుకుంటున్నది ఏంటి అంటే ఆయనకు భారత దేశ వాతావరణం ఇక్కడ పరిస్థితులు బాగా నచ్చాయని అంటున్నారు.