తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లోనూ తెలుగును తప్పనిసరిగా బోధించాలని ఆదేశించింది.
తొమ్మిదో తరగతి వారికి 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేలా చూడాలని విద్యాశాఖకు సూచించింది. పదో తరగతికి 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు విద్యాశాఖకు మార్గదర్శకాలు జారీ చేసింది.