విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ ,ప్రైవేట్ జూనియర్ కాలేజీల ప్తెనా అధికారులు స్పందించకపోతే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం భౌతిక దాడులకు దిగుతాం
ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం
ప్రజాజ్యోతి నిజామాబాద్ ప్రతినిధి:
అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం నాయక్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ప్రవేట్ జూనియర్ కాలేజీలో విద్యా సంవత్సరం పూర్తికాకముందే అడ్మిషన్ల పేరుతో విద్యార్థులు తల్లిదండ్రులకు మరియు విద్యార్ధులకు రోజువారి ఫొన్ చేసి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది.దాంతో 2025_2026 సంవత్సరం అడ్మిషన్ సంబంధించిన ఆఫర్ల పేరుతో వేల కొద్ది రూపాయలు దండుకుంటూ అడ్మిషన్ల నిర్వహిస్తున్నటువంటి దీని ద్వారా పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులు ఇబ్బందులు పడతారు కాబట్టి వెంటనే స్పందించి అడ్మిషన్ నిర్వహిస్తున్నటువంటి కార్పొరేట్ ప్రైవేటు జూనియర్ కాలేజీ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఈ విషయం పైన స్పందించకపోతే మాత్రం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అందులో నిర్వహిస్తామని హెచ్చరిస్తూ. అడ్మిషన్ నిర్వహిస్తున్న కార్పొరేట్, ప్రవేట్ జూనియర్ కాలేజ్ విద్యాసంస్థల పైన భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమాలొ ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు అంజలి,నాయకులు సుభొద్,కుశాల్,రాజు,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.