క్రషర్ ఓనర్ నుండి డబ్బులు ఇప్పించాలని బీరన్న కురుమ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండ గ్రామంలో భూ బాధితులు శనివారం శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ ముందు టెంట్ వేసి న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. బీరన్న కురుమ సంఘానికి చెందిన 75 ఎకరాల 26 గుంటల భూమిని స్టోన్ క్రషర్ వారికీ విక్రయించారు. పూర్తి స్థాయిలో కొనుగోలు డబ్బులు చెల్లించకపోవడంతో భూ బాధితులు టెంట్ వేసుకొని నిరసనకు దిగారు. అధికారులు, నాయకులు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పసరుగొండ శివారులోని వెంకటేశ్వర స్టోన్ క్రషర్ యాజమాన్యం తీరుతో అక్కడ భూ బాధితులు గత నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. తమ భూమిని అమ్మి పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నారు. వెంకటేశ్వర స్టోన్ క్రషర్ డబ్బులు చెల్లించకుండా కాల యాపన చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా బీరన్న కురుమ సంఘం అధ్యక్షుడు పోతరాజు బిక్షపతి, సభ్యులు ఐత రాజు, అన్న రాజ్ కుమార్, అమ్మ కుమారస్వామి, అన్న రమేష్, కోరే రాజ్ కుమార్, బుర్రి సంతోష్, బుర్రి చేరాలు, పోతరాజు రాజు, అన్న రాజు, అమ్మ ఓదెలు తదితరులు పాల్గొన్నారు.