సిద్దిపేట రూరల్ , ఏప్రిల్ 5, (ప్రజాజ్యోతి):విఘ్నేశ్వరుడైన శ్రీ గణపతిని ఆరాధించే పవిత్రమైన సంకష్టహర చతుర్థి సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ నగర్ లో ఉన్న శ్రీ వరదయాంజనేయ దేవాలయంలో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు.భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి గణపతికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. కొబ్బరికాయలు, ఉండ్రాళ్లు, మోదకాలు సమర్పిస్తూ తమ కోరికలు నెరవేర్చాలని ప్రార్థించారు. సాయంత్రం చంద్ర దర్శనం అనంతరం ఉపవాస విరమణ చేసి పూజలు ముగించారు.అనంతరం భక్తులకు భోజన ప్రసాదాలు అందజేశారు.
