ప్రజా సేవలో సంగేం పోలీసులు.. రోడ్డు ఇరువైపుల ముళ్ల పొదలు తీయించిన ఎస్సై వంశీకృష్ణ..!!

Warangal Bureau
1 Min Read

సంగేం ఎస్సై వంశీకృష్ణ ‘సేవలు’ భేష్!

-ఎస్సై పిలుపు.. సర్పంచుల స్పందన

సంగెం, ఏప్రిల్05 (ప్రజాజ్యోతి):

మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల ప్రధాన రహదారుల వెంబడి ప్రయాణీకుల భద్రత కోసం సంగేం ఎస్సై వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు, పిచ్చి మొక్కల వల్ల వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన ఆయన,స్థానిక సర్పంచులతో కలిసి ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎస్సై స్వయంగా పర్యవేక్షిస్తూ,రోడ్డు మలుపుల వద్ద అడ్డంకిగా ఉన్న కొమ్మలను,పొదలను జేసీబీలు మరియు కూలీల సహాయంతో తొలగింపజేశారు.పోలీసుల విజ్ఞప్తికి స్పందించి సర్పంచులు కూడా ఈ పనిలో భాగస్వాములు కావడం విశేషం.

  • హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణీకులు..

రహదారుల శుభ్రత వల్ల ప్రమాదాలు తగ్గుతాయని,నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసులు సామాజిక బాధ్యతగా ఇలాంటి పనులు చేయడం అభినందనీయమని మండల ప్రజలు,వాహనదారులు ఎస్సై వంశీకృష్ణ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *