అంగన్వాడి సెంటర్ లో ఏఎల్ఎంఎస్ సి మీటింగ్

Kamareddy
1 Min Read

అంగన్వాడి సెంటర్ లో
ఏఎల్ఎంఎస్ సి మీటింగ్

రామారెడ్డి మార్చ్ 09 (ప్రజా జ్యోతి)

రామారెడ్డి మండల కేంద్రంలోని అంగన్వాడి పలు సెంటర్ ల లో సోమవారం ఏఎల్ఎంఎస్ సి కమిటీ సభ్యుల తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కమిటీ ప్రతినెల సర్పంచ్ అధ్యక్షతన, ఉప సర్పంచ్ వార్డు మెంబర్ ల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులుగా సర్పంచ్, ఆశ వర్కర్, గర్భిణ మహిళ, ఏడు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల పిల్లల తల్లి, మూడు నుండి ఆరు సంవత్సరాల తల్లి,ఒక రిటైర్డ్ ఉద్యోగి,ఒక సైన్స్ టీచర్, కిశోర బాలిక, స్వయం సహాయక సభ్యులు ఒకరు లేదా ఇద్దరు, అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్ ఆధ్వర్యంలో అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అధికార ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రతినెల లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పౌష్టికాహారం పంపిణీ పై అవగాహన కల్పించి, గర్భిణీ బాలింతలు ఆరోగ్యపరంగా ఉండేందుకు సలహాలు సూచనలు, చిన్నపిల్లలకి హైట్ వెయిట్ మెజర్మెంట్ చేయడం, బలహీనమైన పిల్లలకి బలవర్ధకమైన పౌష్టికాహారం ప్రత్యేకంగా అందించడం లాంటిది కార్యక్రమాలను వివరిస్తారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్, గ్రామ కార్యదర్శి ప్రశాంత్, వార్డు మెంబర్ లు, ఓద్దే రాణి రవి, చింతకుంట భాస్కర్, జీరి గారి రాజు, అంగన్వాడీ టీచర్లు కమల, ఇందిరా, అనసూయ, శోభ, గలవ్వ,ఒగ్గు వెంకట స్వామి, ప్రతి పాఠశాల హెల్పర్ లు,గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లల తల్లులు, పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *