సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం .. – డిప్యూటీ తహసిల్దార్ రంజిత్ కుమార్ 

Warangal Bureau
1 Min Read

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం

* డిప్యూటీ తహసిల్దార్ రంజిత్ కుమార్

హనుమకొండ, మార్చి 09 (ప్రజాజ్యోతి):

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని డిప్యూటీ తహసిల్దార్ రంజిత్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ తహసీల్దార్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. కుటుంబం నుండి సమాజం వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుతూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. మహిళలు విద్య, ఉపాధి, పరిపాలన వంటి అన్ని రంగాల్లో రాణిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా సిబ్బంది కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. మహిళల హక్కులు, సాధికారత మరియు సమాన అవకాశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ సంగీత, జీపివో లు కవిత, శోభ, జూనియర్ అసిస్టెంట్ వెన్నెల కార్యాలయ సిబ్బంది, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *