పర్వతగిరి, మార్చి 10 (ప్రజా జ్యోతి)
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దుగ్యాల వసంతరావు ప్రమాదవశాత్తు పోలుకమ్మ చెరువులో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకొని వెంటనే వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరామర్శించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి – మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి..

Leave a Comment