♦లాల్ సింగ్ తండాలో తాగునీటి పైప్లైన్ పనులకు శ్రీకారం

పరిగి, /కుల్కచర్ల జనవరి 09 (ప్రజాజ్యోతి):
వికారాబాద్లా జిల్లా కుల్కచర్ల మండలం లోని సింగ్ తండా గ్రామపంచాయతీ పరిధిలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గ్రామ సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో తాగునీటి సరఫరా కోసం పైప్లైన్ ఏర్పాటు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి రామ్ లాల్ నాయక్, ఉప సర్పంచ్ లావుడ్య బుజ్జి పాల్గొని పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వార్డు సభ్యులు సూరారం నరేష్, రవి నాయక్, రమేష్, శివ నాయక్, దశరథ్ నాయక్, గోపాల్ నాయక్, సంతోష్ నాయక్తో పాటు తండా వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తాగునీటి పైప్లైన్ ఏర్పాటు పూర్తయితే గ్రామ ప్రజలకు నిత్య తాగునీటి ఇబ్బందులు తీరుతాయని నాయకులు తెలిపారు.
గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
