అక్రమంగా గోమాతలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని
* పోలీస్ స్టేషన్లో వినతి పత్రాన్ని అందజేసిన విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్
నిజాంసాగర్, జూన్ 01 (ప్రజా జ్యోతి)
అక్రమంగా అనుమతులు లేకుండా గోమాతలను తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివారం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పిట్లం ఎస్సై రాజుకు వినతిపత్రం అందజేశారు. బక్రీద్ సందర్భంగా హిందువుల ఆరాధ్య దేవత గోమాతను అక్రమంగా తరలించి క్రూరమైన కార్యకలాపాలకు పాల్పడితే హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టే అని మండిపడ్డారు. వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వినపతి పత్రాలు అందజేశారు. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు నాగరాజు, రంజిత్, సాయిబాబా, శ్రీకాంత్, ప్రశాంత్, శ్రీకాంత్, రమేష్, సాయిరాం సభ్యులు పాల్గొన్నారు.