తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు వరుస శుభవార్తలు చెప్పడానికి రెడీ అవుతోంది. నిరుద్యోగులు,ప్రభుత్వ ఉద్యోగులు, అన్నదాతలు ఇలా అన్ని వర్గాల వారికి గుడ్‌న్యూస్ చెప్పడానికి సిద్ధం అవుతోంది. ఇందుకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్, 2 వేదిక కానుంది. ఈక్రమంలో రాష్ట్రంలో భూమి లేని నిరుపేద రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పనుంది. జూన్ 2న దీని గురించి కీలక ప్రకటన చేయనుంది. భూమి లేక.. అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న నిరుపేద రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. అలాంటి వారికి పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. జూన్ 2న వారికి పట్టాల పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ విషయంపై అధికారులకు కీలక సూచనలు చేశారు. అలానే పోడు భూములు, గిరిజనులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణిలో సమస్యలు మళ్లీ పునరావృతం కాకూడదని.. ఇదే రిపీట్ అయితే అధికారుల మీద చర్యలు తప్పవని..కనుక జాగ్రత్తగా ఉండాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ధరణిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాట్లు జరగొద్దని పొంగులేటి స్పష్టం చేశారు.చిన్న చిన్న భూముల సమస్యలు వేగంగా పరిష్కరించాలని ఈసందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు రెవెన్యూ అధికారులు విధి నిర్వహణలో చాలా సీరియస్‌గా ఉండాలని.. ఏదో సరదా కోసం ఉద్యోగం చేస్తున్నట్లు ప్రవర్తించవద్దని స్పష్టం చేశారు. తమది పేదల ప్రభుత్వమని.. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ శాఖ సిబ్బందికి ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని సూచించారు. అలానే గిరిజనులు, పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు సంయమనం పాటించాలని మంత్రి పొంగులేటి సూచించారు. గిరిజన రైతులను ఇబ్బంది పెట్టవద్దని.. ఇకపై కొత్తగా ఒక్క చెట్టుని కూడా నరకనివ్వొద్దని మంత్రి పొంగులేటి ఆదేశించారు. అయిదే దీన్ని సాకుగా చేసుకుని కొందరు అటవీ అధికారులు.. గిరిజనులను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇక నుంచి పోడు భూముల సాగు గురించి.. ఏ పత్రికలో కూడా బ్యానర్ ఐటమ్ కథనాలు రావద్దని అధికారులకు సూచించారు పోడు భూముల విషయంలో తమ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తెలిపారు. అలానే రాష్ట్రంలోని పేదవాళ్లకి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లని.. వాటి విషయంలో ఎలాంటి పైరవీలు చేయొద్దని తెలిపారు. ఇన్ని సార్లు చెప్పినప్పటికీ కూడా ఎవరైనా అధికారులు మా మాట వినకుండా.. అనర్హులకు కాకుండా ఇల్లు మంజూరు చేస్తే సస్పెన్షన్ కన్నాపెద్ద శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో ఒక్క రూపాయి లంచం తీసుకున్న సహించేది లేదన్నారు. అలానే వీటి ముసుగులో ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు
తెలంగాణలో భూమి లేని రైతులకు శుభవార్త.

Leave a Comment