హైదరాబాద్ ఆఫీసులో కీలక సమావేశం వేళ.. బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. తెలంగాణ బీజేపీ న్యూ చీఫ్ ఎవరనే అంశం ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై కన్నేసిన నేతలు.. అధిష్టానం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఇవాళ జరిగే కమలం పార్టీ వర్క్‌షాప్‌లో చర్చల తర్వాత టీ.బీజేపీ చీఫ్ ఎవరనేదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కొందరు నేతలు చెప్తున్నారు. అతి త్వరలోనే టీ.బీజేపీ నూతన అధ్యక్షుడ్ని ప్రకటించే చాన్స్ ఉందంటుందంటున్నారు.
ఈ అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడి నియామకంపై అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. అయితే.. ఎవరో చెబితే హైకమాండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను నియమించదని గుర్తు చేశారు. దీనికి సంబంధించి బీజేపీకి స్పష్టమైన విధానం ఉందని బండి సంజయ్ చెప్పారు. మొత్తంగా.. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎంపిక వ్యవహారం చాలెంజ్‌గా మారింది. అధిష్టానం వైపు పలువురు కీలక నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇవాళ జరిగే టీ.బీజేపీ కీలక వర్క్‌షాప్‌లో క్లారిటీ వస్తుందా?.. లేదా?.. అన్నది చూడాలి..