వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగిన దంపతులు
రామారెడ్డి మే 22 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని పెద్దమ్మ దుబ్బ వాటర్ ట్యాంక్ పై దంపతులిద్దరూ ట్యాంక్ పై ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే,తల్లిదండ్రులు తమకు తెలియకుండా 15 గుంటల భూమిని అమ్ముకున్నారని ఆరోపిస్తూ కుమారుడు, కోడలు నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగడం జరిగింది. రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన లక్కాకుల అరుణ, శంకర్ లు వీరు దంపతులు. శంకర్ యొక్క తల్లిదండ్రుల పేరు మిద ఉన్న 15 గుంటల భూమిని విక్రయించరాని.తమ తల్లిదండ్రులు అమ్మిన భూమి విషయం తమకు తెలియదని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొడుకు శంకర్, కోడలు అరుణలు నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. సుమారు గంటపాటు ట్యాంక్ పై ఉండి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ప్రొబేషనరీ ఎస్సై నవీన్ చంద్ మాట్లాడుతూ మీకు పోలీస్ ల ద్వారా ఇతర రకాలుగా న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో శాంతించిన దంపతులు పోలీసులు ఈ విషయంలో కల్పించుకోవడంతో శంకర్, అరుణాలను కిందికి వాటర్ ట్యాంక్ పై నుండి దింపడం జరిగింది. ఈ విషయంలో పోలీసుల సహాయం పై ప్రజలు ఆశ హర్షం వ్యక్తం చేశారు.