హైదరాబాద్ బండ్లగూడ రవాణా శాఖ అధికారిణి సునీతపై సీరియస్ యాక్షన్

V. Sai Krishna Reddy
1 Min Read

హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ దక్షిణ మండలం రవాణ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి సునీతపై ఆ శాఖ కమిషనర్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమెపై బదిలీ వేటు వేశారు.

ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రవర్తన బాగోలేకపోవడం, పలు ఆర్థిక అంశాలలో నేరుగా ఆమె ప్రమేయం ఉండటం గురించి ఆమెపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. తదనంతరం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆమెపై బదిలీ వేటు పడింది. ఈ అంశంపై బండ్లగూడ ఆర్టీవో కృష్ణయ్య మాట్లాడుతూ… ఆమె బదిలీ జరిగిందని చెప్పారు. ఆమెను ఎస్టీఏకు అటాచ్ చేశారని తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *