Adilabad Bureau

2 Articles

*రైతు భరోస పై నీలి నీడలేనా?* -అధికార అందలం కోసమే అడ్డగోలు హామీలేనా? -ఓట్ల కోసమే ఆరాటమా! -పథకాలన్నీ హామీలకే పరిమితమా? అధికారం కోసం ఆరాటమే తప్ప -హామీలు అటుకు మీదేనా? -బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నల్ల జగన్ మోహన్ రెడ్డి బోథ్, ఫిబ్రవరి 18 (ప్రజా జ్యోతి) కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే అధికారంలోకి రావడం కోసమే అడ్డగోలుగా హామీలు ఇచ్చి రైతులను నట్టేట ముంచిందని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నల్ల జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ రైతు భరోసా పథకానికి రామ్ రామ్ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ ఒక గుంట నుంచి రెండు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు పడకపోవడంతో ఆవేదన చెందుతున్న అన్నదాతలు అని తెలిపారు. కర్షకులుఈ విషయంపై రెవెన్యూ అధికారులను వివరణ అడిగితే కొన్ని సర్వే నంబర్లు పాలటేషన్ బైలు గా వచ్చిన భూమి పట్టాకు ఎక్కువగా ఉండి మోకా పైన తక్కువగా ఉన్న సర్వే నంబర్లను బ్లాక్ లో పెట్టామని వివరణ ఇస్తున్న అధికారులు.చెత్త చేతగాని ప్రభుత్వం ముఖ్యమంత్రి అసమర్థులైన మంత్రివర్గం తీరుతో అసహనానికి గురవుతున్న అన్నదాతలు అని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా రైతుల నోట్లో మట్టి కొట్టడమేనా? రైతు భరోసా పేరుతో హడావిడిగా చేసినటువంటి భూ సర్వేలో వివరాలు తెలియలేదా ఇన్ని రోజులు చేసింది ఏమీ లేదని మభ్యపెట్టడమేనని విమర్శించారు . ఇంకా కాలయాపన నేనా? అర్హులైన రైతులను గుర్తించిన తీరు ఇదేనా? సాగులో ఉన్నటువంటి అసలు రైతుల పట్ల అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణకు అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు పుట్టగతులుండాయని తెలిపారు. అలాగే పార్టీకి రాబోయే స్థానిక ఎలక్షన్లో బుద్ధి చెప్పడం కాయమని పేర్కొన్నారు.

*రైతు భరోస పై నీలి నీడలేనా?* -అధికార అందలం కోసమే అడ్డగోలు హామీలేనా? -ఓట్ల కోసమే ఆరాటమా! -పథకాలన్నీ…

కనెక్ట్ అయి ఉండండి

25°C
Hyderabad
haze
25° _ 25°
78%
3 km/h
Wed
25 °C
Thu
30 °C
Fri
29 °C
Sat
29 °C
Sun
29 °C