నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు..

నిర్మల్
1 Min Read

మహాశివరాత్రికి జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. మహాశివరాత్రి పండుగను జరుపుకోవడానికి భక్తులు సిద్ధమయ్యారు. ఆదివారం మహాశివరాత్రి పర్వదిన వేడుకల కు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. దేవాలయాల వద్ద క్యూలైన్లు, చలువ పందిళ్లు వేశారు. దేవాలయాల వద్ద జాగరణ చేసే భక్తుల కోసం సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో అన్ని పండుగలు పగలు జరుపుకుంటారు. రాత్రి సమయాల్లో జరుపుకునే ముఖ్య పండుగల్లో దీపావళి, తర్వాత శివరాత్రి మాత్రమే.

oplus_2

ఆలయంలో అభిషేకాలు చేస్తున్న భక్తులు

oplus_2

భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

శివరాత్రి రోజున ప్రతి శివ భక్తుని
హృదయంలో వేద నాదాలతో శివనామం ప్రతిధ్వనిస్తుంది. శివరాత్రి పర్వదినాల్లో శివదీక్షపరుల్లో భక్తి ప్రవాహం పరవళ్లు తొక్కుతుంది. శివరాత్రి జాగరణ మానవ జీవితాల నుంచి కష్టాల నుంచి పరిహారం చేసి ముక్తిదాతగా వరాలు కురిపిస్తుండనే నమ్మకం.

oplus_2

ప్రతి శివా లయంలో శివరాత్రిని అతి పవిత్రంగా భక్తి తన్మయత్వం లో జరుపుకుంటారు. శివరాత్రి రోజు స్వామి లింగోద్భవుడై భక్తు లను అనుగ్రహిస్తాడు. జిల్లాలోని నిర్మల్ జిల్లా పోన్కల్ లో గల శ్రీ భవానీ శంకర క్షేత్రం, కదిలి,బూరుగుపల్లి, కమల్ కోట్ రాజన్న, బాబాపూర్ రాజ రాజేశ్వర ఆలయం తో పాటు జిల్లా కేంద్రంలోని శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉపవాస దీక్షలో ఉండే భక్తులు శివాలయాలను సందర్శించి స్వామివారికి పూజలు చేస్తున్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *