మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట

Medak staff Reporter
2 Min Read

సూర్య మెడికల్ వినూత్న సేవ

తూప్రాన్‌లో 1,100 మట్టి వినాయకుల పంపిణీ

తూప్రాన్ మున్సిపల్ చైర్ పర్సన్ పొంది రజిని రవీందర్ గౌడ్,వైస్ చైర్‌పర్సన్ సమత కాశిరెడ్డి

తూప్రాన్, (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 14:

వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ తూప్రాన్ పట్టణంలోని సూర్య మెడికల్ ఆధ్వర్యంలో 1,100 మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. సూర్య మెడికల్ యాజమాన్యం బొడ్డు రమ్య–శ్రీహరి ఆధ్వర్యంలో సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తూప్రాన్ మున్సిపల్ చైర్‌పర్సన్ బొంది రజని రవీందర్ గౌడ్, వైస్ చైర్‌పర్సన్ సమత కాశిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మట్టి వినాయక విగ్రహాల పంపిణీని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మట్టి విగ్రహాలను స్వీకరించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల నిమజ్జనం సమయంలో నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహిత పండుగల నిర్వహణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ బొంది రజని రవీందర్ గౌడ్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. మట్టి వినాయకులను ప్రోత్సహించడం ద్వారా నీటి వనరులను కాలుష్యం నుంచి రక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.

గత 16 సంవత్సరాలుగా సూర్య మెడికల్ యాజమాన్యం మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషి అభినందనీయమని ఆమె ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో కౌన్సిలర్లు బొడ్డు రాధ శ్రీనివాస్, భైరం సత్యలింగం, చెలిమల రాములు, స్వప్న నాగరాజు గౌడ్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జానకిరామ్ గౌడ్, రాజు గౌడ్, పల్లెర్ల రవీందర్, గుప్త దామోదర్ రెడ్డి, అంజగౌడ్, బిక్షపతి గౌడ్, ఆర్‌ఎంపీ వైద్యులు, సూర్య మెడికల్ యాజమాన్యం, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *