- అంగన్వాడీలో అవినీతి అరాచకం..
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) చిన్నారుల ఆకలి తీర్చాల్సిన బువ్వ.. అంగన్‌వాడీ టీచర్ కక్కుర్తితో పక్కదారి పట్టింది. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని చిన్న గొట్టిముకుల అంగన్‌వాడీ టీచర్ విమల బాగోతాన్ని గ్రామస్థులు రట్టు చేశారు. మంగళవారం మధ్యాహ్నం కోడిగుడ్లు, పాలు, నూనె, బాలామృతం ప్యాకెట్లను కారులో వేసుకుని అక్రమంగా తరలిస్తుండగా యువకులు చాకచక్యంగా పట్టుకున్నారు. గత కొంతకాలంగా చిన్నారులకు పంపిణీ ఎగ్గొట్టి, ఇలా సొమ్ము చేసుకుంటున్న టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాధీనం చేసుకున్న సరుకులను పంచాయతీ భవనానికి తరలించి అధికారులకు ఫిర్యాదు చేశారు.
