ప్రాణరక్షణ కోసం హెల్మెట్.. పోలీసుల వినూత్న ప్రచారం!

Bharath Gowd
0 Min Read

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) ప్రాణరక్షణ కోసం హెల్మెట్ ధరించాలని కోరుతూ నర్సాపూర్ పోలీసులు శనివారం పట్టణ కేంద్రంలో వినూత్న ప్రచారం నిర్వహించారు. సిఐ జాన్ రెడ్డి, ఎస్సై రంజిత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ2 జగన్నాథం, ఏఎస్ఐ శివకుమార్ అవగాహన సదస్సు చేపట్టారు. హెల్మెట్ ధరించి ప్రయాణించే వాహనదారులకు శాలువా కప్పి, రోజా పూవ్వు ఇచ్చి అభినందించారు. నియమాలు అతిక్రమిస్తే ప్రమాదాల వల్ల కుటుంబాలు వీధిన పడతాయని పోలీసులు హెచ్చరించారు. హెల్మెట్ ధరించని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, ఎండల దృష్ట్యా, హెల్మెట్ మేలని సూచించారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ బిక్షపతి, వెంకన్న, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *