అమర్‌నాథ్ సేవా సమితి సేవలు దేశానికి ఆదర్శం

Siddipet Bureau
1 Min Read

సిద్ధిపేట రూరల్, మార్చి 14 , (ప్రజాజ్యోతి) :అమర్‌నాథ్ సేవా సమితి అందిస్తున్న సేవలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో అమర్‌నాథ్ సేవా సమితి చేపట్టనున్న భవన నిర్మాణానికి సంబంధించిన మోడల్ బ్రోచర్‌ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమర్‌నాథ్ సేవా సమితి దేశంలోనే సేవా కార్యక్రమాల్లో ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. భక్తులకు, అవసరమైన వారికి సమితి అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని తెలిపారు.సమితి భవన నిర్మాణాన్ని చేపట్టడం ఆనందదాయకమని, భవనం నిర్మాణానికి తన వంతుగా సంపూర్ణ ఆర్థిక సహాయం అందిస్తానని హరీష్ రావు హామీ ఇచ్చారు. సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమములో సమితి చైర్మన్ చీకోటి మధుసూదన్, అధ్యక్షులు కాచం కాశినాథ్,ప్రధాన కార్యదర్శి గంజి రాములు, కోశాధికారి గోపిశెట్టి శరబయ్య, పబ్లిక్ రిలేషన్ డా. మాంకాల నవీన్ కుమార్, భవన నిర్మాణ కోశాధికారి గుబ్బ లింగమూర్తి, తాజా మాజీ అధ్యక్షులు కార్తీవాడ లక్ష్మణ్ సలహాదారులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు గంప శ్రీనివాస్, జిల్లా శ్రీనివాస్, నల్ల నాగరాజం, ఇల్లెందుల చంద్రశేఖర్, చింత శ్రీనివాస్, పోశెట్టి శ్రీనివాస్, కొమరవెల్లి దుర్గాప్రసాద్, కటకం సత్యనారాయణ, అయిత నాగరాజు, మాడిశెట్టి భాస్కర్, చింత రాజేంద్రప్రసాద్, అయిత రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *