పదవులకతీతంగా సేవే లక్ష్యం..

Rangareddy Bureau
1 Min Read
    1. పదవులకతీతంగా సేవే లక్ష్యం..
      పదవులకతీతంగా సేవే లక్ష్యం..

      కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కన్నగారి శ్రీకాంత్ రెడ్డి

చేవెళ్ల ఫిబ్రవరి
పదవులు ఉన్నా లేకున్నా వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కన్నగారి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను గుర్తించి గురువారం నూతనంగా బోరు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *