చేవెళ్ల (ప్రజా జ్యోతి):
చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 3 వ వార్డు కౌన్సిలర్ కరికె మీనాక్షి సత్యనారాయణ, 10 వ వార్డు కౌన్సిలర్ పెద్దోళ్ల దయాకర్, 12వ వార్డు కౌన్సిలర్ అత్తెలి మనీషా అనంత్ రెడ్డి తదితరులు మాజీ ఎమ్మెల్యే రత్నం, భాజపా చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అతెల్లి అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశంతో పాటు మేనేజర్ నరేందర్, చేవెళ్ల మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమత వెంకటరెడ్డి, 15 వ వార్డు కౌన్సిలర్ బండారు శైలజ ఆగి రెడ్డిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల మెరుగుదల, ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కౌన్సిలర్లు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
