వెనెజువెలా చమురు కొనేందుకు రిలయన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికా

V. Sai Krishna Reddy
1 Min Read

రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనెజువెలా నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం లైసెన్స్ మంజూరు చేసింది. ఈ క్రమంలో తక్కువ ధరకు చమురును దిగుమతి చేసుకునే అవకాశం కంపెనీకి లభించింది. ఇప్పటికే పలువురు అంతర్జాతీయ ట్రేడర్లు ఈ అనుమతిని పొందగా, తాజాగా భారత్‌కు చెందిన ప్రైవేటు సంస్థ అయిన రిలయన్స్‌కు కూడా లైసెన్స్ లభించింది. అయితే, ఈ విషయంపై రిలయన్స్ నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.

కొన్ని రోజుల క్రితం వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుని, ఆ దేశ చమురు రంగంపై ఆంక్షలు విధించింది. అనంతరం ఆ ఆంక్షలను సడలిస్తూ, అక్కడి చమురును విక్రయించేందుకు వ్యాపారులకు అనుమతులు ఇచ్చింది. అయితే, 2019-20లో అమెరికా ఆంక్షలు అమల్లోకి రావడానికి ముందు కూడా రిలయన్స్ వెనెజువెలా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకునేది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *