నామినేషన్ ప్రక్రియ పరిశీలన,అవగాహన కల్పించారు  ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి  సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ

Nalgonda Bureau
1 Min Read

చివ్వెంల డిసెంబర్ 01(ప్రజా జ్యోతి):చివ్వెంల మండలం చందుపట్ల గ్రామంలో రెండవ విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద నామినేషన్ల ప్రక్రియను పోలీసు బందోబస్తును పరిశీలించారు.అనంతరం గ్రామ ప్రజలతో ఎన్నికల నామినేషన్ వేసిన అభ్యర్థులతో మాట్లాడి ఎన్నికల నియామ వాలి పట్ల ప్రశాంతత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించారు.ఎన్నికల నియమావళి సందర్భంగా సమస్య ఆత్మకంగా గ్రామాలను సందర్శించి ప్రజలకు ఎన్నికల నియమావళి గురించి వివరిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలికి లోబడి నడుచుకోవాలని కోరారు.గ్రామ ప్రజలందరూ కలిసిమెలిసి ఉండి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని పోలీస్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణ సిబ్బందికి సహకరించాలని కోరారు.ఎన్నికల నిర్వహణలో సమస్యలు సృష్టించకుండా ఉండడానికి సత్ప్రవర్తనతో ఉండటానికి గాను గుర్తించిన వ్యక్తులను బైండోవర్ చేస్తామని అన్నారు.బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి వారిపై పూచికత్తు నగదును రెండు లక్షల నుండి 5 లక్షల వరకు కట్టించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా వారి ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు.ఎన్నికల్లో నిలబడుతున్న అభ్యర్థులు ప్రజల మనసుని చురగొనాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రడోభాలకు గురి చేయొద్దని డబ్బు మద్యం ఇతర బహుమతులు అంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దని కోరారు.ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తులు సొంత గ్రామం వారే కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలని వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని సూచించారు.ఎన్నికల రోజు ముందు 44 గంటల నిబంధనలు అమలులో ఉంటాయని ఈ సమయంలో ప్రచార నిర్వహించవద్దని ప్రజలు గుంపులుగా చేరవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి ప్రసన్నకుమార్,సిఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు,స్థానిక ఎస్సై మహేశ్వర్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *