మహేశ్వరి ఆయిల్ యాజమాన్యం తీరే వేరు..?

Kamareddy
1 Min Read

మహేశ్వరి ఆయిల్ యాజమాన్యం తీరే వేరు..?

మేనేజర్ సురేష్ కుమార్ పై స్థానికుల ఫైర్

తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి

భిక్కనూరు అక్టోబర్ 12 (ప్రజాజ్యోతి) 

భిక్కనూరు మండలంలోని జంగంపల్లి శివారులో గల 886 సర్వే నెంబర్లు గల మహేశ్వరి ఆయిల్ పరిశ్రమ లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వారికి ఉద్యోగ భద్రత కార్డ్స్ ఇవ్వాలని, లేబర్ రైట్స్ ప్రకారం ఇన్సూరెన్స్ కల్పించాలని, ఈ పరిశ్రమ ద్వారా గ్రామంలోని యువతీ, యువకులకు ఉపాధి దక్కుతుందని ఆశపడ్డ వారందరికీ నేడు నిరాశ ఎదురయింది.కేవలం మేనేజర్ సురేష్ కుమార్ యొక్క వింత ధోరణి వల్ల స్థనికులకు ఉద్యోగం లేకపోగా,గతంలో 40 మంది పనిచేసిన మహిళ కార్మికులు నేడు ఒక్కరు కూడా లేరు.దానికి కారణం వినిపిస్తున్న పేరు మేనేజర్ సురేష్ భాష తీరు అని స్థానికులు తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు శివ శంకర్ మాట్లాడుతూ… ఇటీవల మేనేజర్ విలేకరులతో మాట్లాడిన తీరును గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్యంలో పాత్రికేయులకు లేని విలువ సామాన్య కార్మికులకు ఉంటుందా అని ఆయన నిలదీశారు.పరిశ్రమలో కార్మికుల నియామకం కేవలం మేనేజర్ చేతిలో ఉండడం వల్ల దాన్ని ఆయన సరిగా ఉపయోగించుకోవడంలేదని, మేనేజర్ పదవికి ఆయన అర్హుడు కాదని అన్నాడు.స్థానికుల కంటే కూడా బిహారి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ స్థానికులు బీహార్ కు వలస వెళ్లే పరిస్థితులు తీసుకొచ్చారని, దీనివల్ల 75% స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లేకుంటే ఈ విషయమై ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరుగుతుందని హెచ్చరించాడు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *