ఆమె జీవితం కష్టాలు…. కన్నీళ్లు
ఆమె జీవిత మంతా కన్నీళ్ళ వెతలే… కష్టాల కథలే….
ఆకలి ఆరాటం బతుకు కోసం పోరాటం
గాలి దుమారానికే ఎగిరిపోయే పూరి గుడిసె
కట్టుకున్నవాడు తిరుగుబోతు, తాగుబోతు గా మారి
తన ఇద్దరు ఆడ కూతుళ్లను, వృద్ధురాలు తల్లిని సాకుతూ
ఒక కూతురు మానసిక విక లాంగురాలు మంచానికే పరి మితం
తన మేనల్లుడిని పెంచి పెద్ద చేసి చేర దీసినా
మేనల్లుడు మెతుకు పెట్టని వై నం
చిన్నపాటి కిరాణా కొట్టే ఆమె జీవన ఆధారం
అయ్యా కలెక్టర్ సారు…. ఓ ప్రభుత్వమా….. ఆదుకోండి
దీనంగా దిన దిన భారంగా బ తికీడుస్తున్న ఓ తల్లి ఆవేదన
ఆదిలాబాద్ బ్యూరో ఫిబ్రవరి 4
ఆమె జీవితం అంతా కన్నీళ్ళ వెతలే… కష్టాల కథలే….. ఆకలి కోసం ఆరటం, బతుకు కోసం పో రాటం చేస్తూనే ఉం ది.గాలి దుమారానికి ఎగిరిపో యేపూరి గుడిసెలో కాలం వె ళ్ళదిస్తూ, కట్టుకున్న వాడు తి రుగుబోతు, తాగు బోతుగా మారినా తన ఇద్దరు కూతుళ్ల ను, తల్లి నీ సాకుతూ వస్తుంది. ఒక కూతురు మానసిక విక లాంగురాలు, తల్లి వృద్ధాప్యం తో మంచానికే పరి మితమైనా తన మేనల్లుడిని పెంచి పెద్ద చే సినా కనీసం చేరదీయడం లే దు. మేనల్లుడు మెతుకు పెట్ట ని వైనం. ఈ ఓ తల్లి దీన గాత పై ప్రజాజ్యోతి ప్రత్యేక కథనం.
వారిది రెక్కాడితే కానీ డొక్కా డని పరిస్థితి. మారు మూల గ్రామీణ ప్రాంతంలో తన కున్న వర్షాధారం మీదనే ఆధారపడి పంటలు సాగుచేస్తున్న ఆరు ఎ కరాలులో సంవత్సరం కాలం కు సరిపోయే విధంగా పంటలు సాగుచేస్థూ కుటుంబ పోషణ ను నెట్టుకొచ్చారు. వారే కొర్రె భ గీరథ బాయి, కొర్రె చంద్రన్న. వా రిది రైతు కుటుంబం.వ్యవసా యం చేసుకుంటూ కాలం వెల్ల దీశారు. వారిది ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం సాంగ్వి ( కె) గ్రామం. వారికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు అనారోగ్యం తో గతంలోనే మృతి చెందా రు. ఒక్క కుమార్తె ఒక కుమా రుడు ఉన్నారు. వారిని అంతో ఇంతో చదివించారు. పదవ త రగతి వరకు చదివించారు. కు మారుడు కొర్రి లింగన్న ఆర్టీసీ ఉద్యోగం సంపాదించగా కు మార్తె ఆసావార్ రాధ వివాహం అయిన తర్వాత భర్త ఆసావా ర్ గంగన్నతో కలిసి గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ జీ వనం కొనసాగిస్తూ వచ్చారు. అంతలోనే రాద 10 వ తరగతి వరకు చదువు కోవడం తో ఆ మెకు గ్రా మంలోనే ఆశా వర్క ర్ గా అవకాశం లభించింది. ఈ ఆశా వర్కర్ గా పని చే స్తూ,భర్త గంగన్న కూలీ పని చే స్తూ నాలుగు డబ్బులు జమ చేసుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ లో ఒక ప్లాటు (ఇళ్లుస్తలం) కొనుగోలు చేసుకుని ఒక రేకుల షెడ్డు వే సుకుని నివాసం ఉంటున్నా రు. ఆమె సోదరుడు లింగన్న కూడా ఆర్టీసీలో ఉద్యోగం సం పాదించి ఆదిలాబాద్ జిల్లా కేం ద్రంలోని శాంతి నగర్ లో ఓ ఇంటి స్థలం ను కొనుగోలు చే సుకొని ఇళ్లు నిర్మించుకొని బా ర్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆసావార్ రాద గంగన్న లకు ఇద్దరు కూతుళ్లు, అయితే వీరి తండ్రి చంద్రన్న గత 20 సంవత్సరాల క్రితం మృతి చెందారు. అప్పటి నుం చి తల్లి భగీరథ బాయి కూ తురు ఆసావార్ రాధ వద్ద ఉంటూ బతుకు బండి కొన సా గిస్తోంది, ప్రస్తుతం భగీరథ బా యి 90 ఏళ్ల వయస్సుతో వృ ద్ధాప్యాన్ని మోసుకొస్తుంది. భర్త లింగన్న గత 20 సంవత్సరాల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి భగీరథ బాయి కూతు రు రాద వద్ద నివాసం ఉంటుం ది. అప్పటి నుంచి తల్లి పోషణ ను కూతురు రాదనే చూసు కుంటూ బాసటగా, అండగా ఉంటుంది. ఆ కూతురు రాద కు ఇద్దరు కుమార్తె లు. ఒక కు మార్తె శ్రీజ పుట్టుక తోనే మాన సిక వికలాంగు రాలు, మరో కు మార్తె హైదరాబాద్ లో ఓ ప్రైవే టు కంపెనీలో పని చేసుకుం టూ చదువుకుటుంది. అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ లో ఆసావార్ రాద భర్త గంగన్న ప్రతీ రోజు పీకల దాకా తాగి కూలీ, నాలీ చేసు కుంటూ తాగు బోతు, తిరుగు తూ ఉంటాడు. కుటుంబ స భ్యుల గురించి ఏ మాత్రం ప ట్టించుకోడు. రాద తన కుటుం బ పోషణను నెట్టుకొని రావ డానికి ఇంటి వద్ద పూరి గుడి సెలో ఓ చిన్న కిరాణా కొట్టు పె ట్టుకుని జీవనం సాగిస్తోంది.ఈ కొట్టు పైనే తల్లీ,ఇద్దరు కుమార్తె లను సాకు తోంది. ఒక కూతు రు మానసిక వికలాంగు రాలు కావడం వల్ల ఆమె మంచానికే పరిమితం అయింది. ఆ కూతు రుకు దాదాపు 23 సం వత్సరా ల వయస్సు ఉంటుంది. ఇప్ప టికీ చంటి పిల్లలా చూ సుకుం టుంది. అటు తల్లీ భగీరథ బా యి కూడా వృద్ధురాలు. దాదా పు 90 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఆమెకు ఏ మాత్రం నడువరాదు. ఆమె కూడా మం చానికే పరిమితం. ప్రతి రోజు తల్లీ, కూతుళ్ల ఆలనా, పాలన ఆమెనే రాద చూసుకుంటుం ది. గత రెండు సంవత్స రాల క్రితం సోదరుడు లింగన్న ఆర్టీ సీలో ఉద్యోగం చేస్తూ రోడ్డు ప్ర మాదంలో మృతి చెందాడు. సోదరుడు లింగన్నకు ఒక కు మారుడు కుమార్తె ఉంది. కు మార్తెకు గత పది సంవత్స రా ల క్రితమే వివాహం జరిగింది. కుమారుడికి ఇంకా వివాహం కాలేదు. చంద్రన్న, భగీరథ బా యి దంపతులు సంపాదించిన ఆరు ఎకరాల వ్యవసాయ భూ మి జైనథ్ మండలంలో కు మారుడు లింగన్న పేరు పైన మార్చుకున్నారు. లింగన్న ఇ టీవల గత రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తో ఆయన కుమారుడు విజ య్ కి రైతు బీమా పథకం కింద ఐదు లక్షల రూపాయ లతో పా టు ఇతర భీమా డబ్బులు దా దాపు కోటి రూపాయలకు పైగా వచ్చాయి. లింగన్న పేరు పైన మార్చుకున్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమి కొడుకు విజయ్ కుమార్ పై మార్చుకు న్నాడు. తల్లి తండ్రి సంపాదిం చిన ఆస్తులలో కుమారుడితో పాటు కుమార్తెకు కూడా భాగ స్వామి ఉంటుందని భావించి ఒక కూతురు రాధా తనకు వ్యవసాయ భూమిలో వాటా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూనే ఉంది. సోదరుడి కుమారుడు, మేనల్లుడు కి ఇంకా పెళ్లి కాలే దు. కొర్రి లింగన్న 2003 లో చ నిపోయాడు. అదిలాబాద్ లో ని శాంతి నగర్ లో నివాసం ఉంది. తండ్రి కొర్రి లింగన్న కు చెందిన భీమా సంస్థ డబ్బులు రూ కోటికి పైగా వచ్చాయి. కా రుణ్య నియామకం కోసం ఎ దురు చూస్తున్నాడు. లింగన్న సోదరి ఆసావార్ రాధ ఆదిలా బాద్ లోని గాంధీనగర్ లో ని వాసం ఉంటుంది. బర్త ఆసా వార్ గంగన్న ఇంటి విషయాలు ఏమీ పట్టించు కొడు, ప్రతీ రో జూ మద్యం మత్తులో తూలు తూ తేలియాడుతూ ఉంటా డు. రాధకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మేనల్లుడు విజయ్ కుమార్ కు తన సోదరుడు లింగన్న కు చెందిన కోటి రూపా యలకు పైన ఆస్తి ఉన్నప్పటికీ మేనల్లుడు మెతుకు పెట్టడం లే దు. భర్త గంగన్న తాగుబోతు. భార్యా పిల్లలను ఏమాత్రం ప ట్టిం చుకోడు. తల్లి కూతుర్ల ఆలనా పాలన చూసుకోవడం కోసం ఆమె తనకున్న చిన్న ఆశా వర్కర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసింది. ఒకవైపు తల్లిని మరోవైపు మానసిక వికలాం గురాలైన కూతురును ప్రతి రో జు చంటి పాపల చూసుకుం టూ,పోషించు కుంటూ కాలం వెళ్లదీస్తు న్న తనకు న్యాయం చేయుమని కలెక్టరేట్ కార్యాల యం చుట్టూ గత మూడు సం వత్సరాలుగా ఆసావార్ రాద తిరుగుతూ ఉంది. కనీసం ఇ ళ్లుకూడా లేదు.పూరి గుడిసె లాంటి రేకుల షెడ్డు లో ఓ చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటూ ఇద్దరినీ సాకుతూ కాలం వెళ్లదీ స్తోంది. కనీసం తన తల్లి,తండ్రి సంపాదించిన ఆరు ఎకరాల భూమి నుంచి తనకు అంతో కొంత భూమి ఇవ్వాలని వేడు కుంటూ కలెక్టరేట్ కార్యాల యం చుట్టూ తిరుగుతూ వి న తిపత్రాలు సమర్పి స్తూనే ఉం ది. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో కూతురుకు కూడా వాటా ఉన్నప్పటికీ ఆ వాటాను ఇవ్వడానికి ఎంత ప్రాధేయ పడినా అధికారులు ఎవరూ కనికరించడం లేదని ఆమె ఆవే దన వ్యక్తం చేస్తుంది. నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నా ఉన్నతాధికారులు గాని, కలెక్టర్ గాని ఏమాత్రం కనికరం చూపలేక పోతున్నా రు. కనీసం వినతులపై స్పం దించ లేకపోతున్నారు. అధి కారులు ఎవరూ కూడా ఆమె కు కనికరించ లేకపోతున్నారు. దిన, దినం భారంగా బతుకీడు స్తూ తన ఆ వేదనను వచ్చిన వారితో, కలిసిన వారితో వెల్ల బుచ్చుతునే ఉంది. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పం దించి దినదిన గండంగా బతుకీ డుస్తున్న తనను ఆదుకోవాల ని ఆమె వేడుకుంటుంది.