అమిత్ షాపై విమర్శలు హాస్యాస్పదం: ఎంపీ రఘునందన్ రావు

Bharath Gowd
1 Min Read

 ఉడుత ఊపులకు భాజపా నాయకులు, కార్యకర్తలు భయపడరు!

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కేసులు పెట్టాలంటూ కొందరు స్వయం ప్రకటిత మేధావులు చేస్తున్న విమర్శలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పత్రికా శీర్షికల కోసమే ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో నక్సలిజం అంతమవుతుందనే భయంతోనే ‘అర్బన్ నక్సలైట్లు’ విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. యువతను తప్పుదోవ పట్టిస్తే ప్రజలు క్షమించరని, ఇటువంటి ఉడుత ఊపులకు భాజపా కార్యకర్తలు ఎవరూ భయపడరని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం పౌర సమాజాన్ని గందరగోళానికి గురిచేయడం సరికాదని హితవు పలికారు. మరిన్ని వివరాలు రేపటి ప్రజాజ్యోతిలో..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *