రజనీకాంత్ ‘కొచ్చాడయాన్’కు ఏఐ హంగులు

V. Sai Krishna Reddy
1 Min Read

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన మూవీ కొచ్చాడయాన్. 2014లో విడుదలైన ఈ యాక్షన్ – అడ్వెంచర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఇందులో హీరోయిన్‌గా కనిపించింది.

మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో విస్తృత చర్చకు దారి తీసింది. విజువల్స్ కార్టూన్ సినిమాను తలపిస్తున్నాయంటూ ప్రేక్షకుల నుంచి విమర్శలు, ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి.

అయితే తాజాగా ఈ మూవీకి సరికొత్త హంగులతో టీజర్ విడుదలైంది. ఏఐ సాయంతో రూపొందించిన ఈ టీజర్ తలైవా అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు, మొత్తం సినిమాన్నే ఏఐ టెక్నాలజీతో రీ – జనరేట్ చేసే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం.ఈ చిత్రానికి రజినీకాంత్ కూతురు సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన విషయం విదితమే.

 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *