ఓటింగ్ సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎన్నికల అధికారి కలెక్టర్ కె.హైమావతి

Siddipet Bureau
1 Min Read

ఓటింగ్ సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎన్నికల అధికారి కలెక్టర్ కె.హైమావతి

చేర్యాల ఫిబ్రవరి 11(ప్రజాజ్యోతి):జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి చేర్యాల మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – పెద్దమ్మగడ్డ, పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(కో ఎడ్యుకేషన్) లోని పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ సరళిని బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల్లో 100 మీటర్ల పరిధిలో వాహనాలు, మొబైల్ ఫోన్‌లను అనుమతించకూడదని, వృద్ధులు, వికలాంగులకు వీల్‌చైర్‌ ద్వారా లోపలికి తీసుకురావాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.144 సెక్షన్‌ను కఠినంగా అమలు చేసి గట్టి బందోబస్తు నిర్వహించాలని పేర్కొన్నారు. కలెక్టర్‌ వెంట ఏసిపి వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ నాగేందర్, తహసీల్దార్ దిలీప్ కుమార్ తదితరులు ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *