సిద్దిపేట, అక్టోబర్ 15 (ప్రజాజ్యోతి): సిద్దిపేట పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస నగర్ కాలనీలోభవానీమాత ఫామిలీ మాత అసోసియేషన్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గామాత కరుణాకటాక్షాలతో ప్రజలందరికీ మంచి జరగాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. సిద్దిపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజ వేస్తూ ప్రగతిపథంలో పయనించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండి ప్రజల జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు నింపాలని ఆకాంక్షించారు.శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమములో వార్డు కౌన్సిలర్ అత్తర్ పటేల్ ,అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు .
