Rangareddy Bureau
1 Min Read

సత్యం.. అహింసే గాంధీజీ బాట

– లాల్‌బహదూర్‌ శాస్త్రి దేశభక్తి.. నిరాడంబరత ఆదర్శం

  • – చేవెళ్ల తహసీల్దార్‌ కృష్ణయ్య

చేవెళ్ల ప్రజా జ్యోతి

సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకుని దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహాత్మాగాంధీ ఆశయాలు.. దేశభక్తి, నిరాడంబరతకు ప్రతిరూపంగా నిలిచిన లాల్‌బహదూర్‌ శాస్త్రి స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని చేవెళ్ల తహసీల్దార్‌ (ఎమ్మార్వో) కృష్ణయ్య అన్నారు. గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా బుధవారం చేవెళ్ల ఎమ్మార్వో కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ చూపిన సత్యం, అహింస మార్గాలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమని అన్నారు. లాల్‌బహదూర్‌ శాస్త్రి దేశం పట్ల చూపిన అంకితభావం, నిరాడంబర జీవనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వారి ఆశయాలను నేటి తరం ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో మహేందర్, నరేష్, గోపాల్, నర్సింలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *