ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశానికి హాజరు కావాలి
– ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్
పర్వతగిరి, ఏప్రిల్ 15 (ప్రజాజ్యోతి)::
పర్వతగిరి మండలంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ తెలిపారు. ఈ సమావేశం 16 గురువారం రోజు ఉదయం 9 గంటలకు పర్వతగిరి రైతు వేదికలో ఏర్పాటు చేయబడినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు,రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహజ్యోతి వంటి పథకాల లబ్ధిదారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాల అమలు పురోగతిని సమీక్షించడం, సమస్యలను గుర్తించడం మరియు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. కావున సంబంధిత వారందరూ సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
