ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

Nalgonda Bureau
1 Min Read

సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 09(ప్రజాజ్యోతి):పెన్ పహాడ్ మండల పరిధిలోని ధర్మపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వరి సన్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి క్వింటాకు 500 బోనస్ అందిస్తున్నట్లు గుర్తుచేశారు. రైతులకు ఉచిత కరెంట్,ఋణ మాఫీ,రైతు భరోసా,500 బోనస్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు.దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు.అందుకోసమే రాష్ట్రంలో సన్నాలు పండించే రైతులను ప్రోత్సహస్తుందని అన్నారు. దీనివల్ల మన రైతుల వద్దనే సన్నాలు కొని మళ్ళీ మనకే సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందువలన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పంటను అమ్మాలని సూచించారు.తేమ 17శాతం ఉండాలని, బస్తా 41 కేజీలు మాత్రమే తూకం వేయాలని ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు, సూర్యాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్, మండల కాంగ్రెస్ నాయకులు నారాయణ ప్రవీణ్ రెడ్డి, భూక్య సందీప్ రాథోడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సుంకరి సుజాత, సంఘ బంధం అధ్యక్షురాలు దొంగరి రేణుక, బుక్ కీపర్ నెమ్మది సునీత, ఎపియం అంజయ్య, వెలుగు సీసీ పద్మ, కోశాధికారి బొల్లికొండ కవిత, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లికొండ మనోహర్, మాజీ ఉప సర్పంచ్ కోకా హుస్సేన్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండు పెద్ద వెంకన్న, మాజీ సర్పంచ్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *