దామెర మండలంలో ఉపాధి హామీ పనుల పరిశీలన
దామెర, జనవరి 9 (ప్రజాజ్యోతి):
దామెర మండలంలోని సీతారాంపురం గ్రామంలో చేపట్టిన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ పనులను అధికారుల బృందం పరిశీలించింది. రైతును పలు వివరాలు అడిగి తెలుసుకున్న అధికారులు, చేపడుతున్న పనులు ఉపయోగకరంగా ఉన్నాయని రైతు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్, ఎంపీడీవో, సర్పంచులు, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అలాగే మాల్దీవుల నుంచి వచ్చిన కౌన్సిల్ బృందం సభ్యులు, ఆర్డీ ప్రతినిధి శిరీష రెడ్డి, డీవీసీ నర్సింహారెడ్డి, జేడీఎం శ్రీనివాస్, ఎస్బీఎం కోఆర్డినేటర్ సంపత్ తదితరులు హాజరయ్యారు.
అనంతరం ఒగ్లాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న కోళ్ల షెడ్ పనులను అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి గారు మరియు సిబ్బంది అధికారుల బృందాన్ని సన్మానించారు. ఈ మండలంలో దుబాసి రాధాకృష్ణకు సంబంధించిన మూడు లక్షల నాటు కోళ్ల యూనిట్, అలాగే రైతు రంజాన్ (మొ. రాజ్ మహమ్మద్) చేపట్టిన రూ.2,63,000 విలువైన డ్రాగన్ ఫ్రూట్ తోట పనులు ఆదర్శవంతంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

