వరంగల్ సిటీ, ఏప్రిల్ 17 (ప్రజాజ్యోతి):
వరంగల్ లో దారుణం
– మూడేళ్ల చిన్నారికి బిస్కెట్ కొనిచ్చి యువకుడి అసభ్య ప్రవర్తన
– ఫోక్సో కేసు నమోదు
– నిందితుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన రంజాన్ గా గుర్తింపు
వరంగల్ నగరంలోని గిర్మాజిపేటలో అమానవీయమైన రీతిలో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారికి బిస్కెట్ కొనిస్తానని చెప్పి తీసుకెళ్లిన ఓ వ్యక్తి ఆ పాపతో అసభ్యకర రీతిలో ప్రవర్తించిన ఘటన బుధవారం రాత్రి ఇంతేజారుగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాజీపేటలో చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన పెయింటింగ్ పని చేసే రంజాన్(33) అనే వ్యక్తి అతడు నివాసం ఉండే కాలనీలో బయట ఆడుకుంటున్న మూడు సంవత్సరాల వయసు గల పాపకు బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తాననీ చెప్పి తను ఉండే గదిలోకి తీసుకెళ్లి పాపతో అసభ్యకర రీతిలో ప్రవర్తించగా ఆ పాప ఏడవడంతో గమనించిన స్థానికులు రంజాన్ ను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఘటనపై విచారణ చేసిన ఇంతే జార్గంజ్ పోలీసులు నిందితుడి పై ఫోక్సో, హత్యాచారయత్నం తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.