అచ్చ తెలుగు అమ్మాయి రంభ 90వ దశకంలో టాలీవుడ్ ను షేక్ చేసింది. అందంతో పాటు తన నటనతో అభిమానులను మైమరపించింది. అగ్ర హీరోలందరి సరసన నటించింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. బాలీవుడ్ లో సైతం మెరిసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. సినీ పరిశ్రమకు రంభ దూరమైనా ప్రేక్షకులు ఆమెను ఇప్పటికీ మర్చిపోలేదు. అప్పటితరం ప్రేక్షకులలో ఎంతో మందికి ఇప్పటికీ రంభ ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి రంభ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా రంభ మాట్లాడుతూ… సినిమా అనేది తన ఫస్ట్ లవ్ అని తెలిపింది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఇది సరైన సమయంగా భావిస్తున్నానని చెప్పింది. ఒక నటిగా ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు ఇది కరెక్ట్ టైమ్ అని తెలిపింది. పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులకు అర్థవంతమైన రీతిలో కనెక్ట్ కావాలనుకుంటున్నానని చెప్పింది.